తెలంగాణ

ఇన్సిపెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసిబి

ఇన్సిపెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసిబి

నవదిశ, తెలంగాణ బ్యూరో :స్టేషన్ బెయిల్ ఇప్పించి, భవిష్యత్తులో వేధించబోనని చెప్పి లక్ష లంచం డిమాండ్ చేసిన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ఏసిబి అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ వి. నరసింహులు లంచం ఒక కేసులో ఫిర్యాదు దారుడి నుంచి స్టేషన్ బెయిల్ ఇప్పించి, కేసులో ఇకపై వేధింపులు ఉండవని హామీ ఇస్తానంటూ లక్ష రూపాయయలు లంచం డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం ఫిర్యాదు దారుడు మొదటి విడతగా రూ. 50,000 ఇచ్చేందుకు అంగీకరించాడు. ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసిబి అధికారులు, ఫిర్యాదు దారుడు డబ్బు ఇస్తున్న సమయంలో ఎస్‌ఐ నరసింహులును పట్టుకున్నారు. ఆయన స్వాధీనం నుంచి లంచం డబ్బు రూ. 50,000 ను స్వాధీనం చేసుకున్నారు. విధిని సరిగా నిర్వర్తించకుండా అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసిబి నిర్ధారించింది. ఎస్‌ఐ నరసింహులును నాంపల్లిలోని జడ్జి ముందు జ్యుడీషియల్ రిమాండ్ కోసం హాజరు పరిచిరి రిమాండ్ కు తరలించారు.