ఆంధ్రప్రదేశ్

‘జీవితాంతం అండగా ఉంటాం‘.. స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు నారా లోకేష్ భరోసా

‘జీవితాంతం అండగా ఉంటాం‘.. స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు నారా లోకేష్ భరోసా

నవదిశ, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. మంగళవారం కేజీహెచ్ కు చేరుకున్న మంత్రి లోకేష్ బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాల బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ కూడా మంత్రి నారా లోకేష్ తో పాటు బాధితులను పరామర్శించారు.