నవదిశ, మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని నగరవనం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలిగా గుర్తించారు. వీరు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్తున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

