ఆంధ్రప్రదేశ్

పరువు నష్టం కేసులో ..పోలీస్ స్టేషన్‌కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..

పరువు నష్టం కేసులో ..పోలీస్ స్టేషన్‌కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..

నవదిశ, అమరావతి: వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తనపై మంత్రి టిజి భరత్ పెట్టిన కేసులో కర్నూలు 3వ పట్టణ పోలిస్టేషన్‌లో విచారణకు ఆయన హాజరయ్యారు. మే 14వ తేదీన మంత్రి టీజీ భరత్ కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఆరోపణను సిద్ధార్థ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆగ్రహించిన మంత్రి టీజీ భరత్ సివిల్ పరువునష్టం దావా వేశారు. అనంతరం క్రిమినల్ పరువు నష్టం కేసు కూడా పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వగా నేడు ఆయన విచారణకు హాజరయ్యారు.