జిల్లా వార్తలు

కుచర్కల్ గ్రామంలో వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

కుచర్కల్ గ్రామంలో వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

నవదిశ, జడ్చర్ల: రాజాపూర్ మండలంలోని కుచర్కల్ గ్రామంలో నూతన ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ శివపరివారం రామా పరివారం నవగ్రహాలు ధ్వజస్తంభాల ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో జడ్చర్ల శాసనసభ్యుడు జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు హోమాల్లో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని ప్రాంతం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.