నవదిశ, మహబూబాబాద్: పాత పెన్షన్ పునరుద్ధరించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఎస్ టి ఎఫ్ ఐ పిలుపు మేరకు దానిలో భాగస్వామ్య సంఘమైన టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ అధ్యక్షతన నిరసన ప్రదర్శన చేపట్టారు.. ఈ నిరసన ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగ ,ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వాటి పరిష్కారం కోసమే నిరసన ప్రదర్శన చేపట్టామని అన్నారు.
జూలై 1 ,2023 నుంచి అమలు కావాల్సిన పిఆర్సి నేటికీ 36 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి నివేదికను బహిర్గత పరచలేదని అన్నారు ..వెంటనే పిఆర్సి నివేదికను తెప్పించుకొని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు ..అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డి ఏ లు పెండింగ్లో పెట్టారని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఐదు విడతల డి ఏ ను విడుదల చేయాలని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు.. అలాగే నూతన విద్యా విధానం ఎన్.ఈ.పి -2020 ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని ,పాఠశాలలు లేని ప్రాంతాల్లో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ..టీఎస్ యుటిఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి యాకూబ్ జిల్లా కార్యదర్శి హరినాయక్ సంజీవ నాయకులు కుమార్ రాజశేఖర్ ప్రవీణ్ రెహమాన్ బాలు సత్తార్ వీరభద్రం సోమేశ్వర్ భరత్ బాబు కూతురు శ్రీను నాగేశ్వరరావు రాజయ్య సురేష్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

