నవదిశ, తెలంగాణ బ్యూరో :
వ్యవసాయ భూములు పంట అవశేషాలైన వరి కొయ్యలను కాల్చినందుకు రూ.5, 000 జరిమానా విధించిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన రైతు బానోతు కృష్ణారావు తనకు చెందిన వ్యవసాయ పొలంలో వరి కొయ్యలను దగ్ధం చేశాడు. దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.5,000 రూపాయలను జరిమానా విధించారు. కాగా ఇప్పటికే వరికోయలను పంట పొలాల్లో కాల్చవద్దని వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తూ, పంట వ్యర్ధాలను కలిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో తాజాగా నేలకొండపల్లిలో రైతుకు ఐదువేల రూపాయలు జరిమానా విధించారు. దీనికి సంబంధించిన రసీదు సైతం సామాజిక మధ్యమలో వైరల్ అవుతోంది.

