నవదిశ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది. వైరా రోడ్డులోని మొబైల్ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు బుధవారం అర్ధరాత్రి కారులో వచ్చి దర్జాగా లూటీ చేసినట్లు సమాచారం. సుమారు రూ.2 కోట్ల విలువైన ఐఫోన్లు చోరీ చేసినట్లు తెలుస్తోంది. షాపులో భద్రత కోసం ఏర్పాటు చేసిన అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో తప్పించుకున్నారు. అయితే స్టాక్ వచ్చిన కొన్ని గంటల్లోనే చోరీ జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఘటనాస్థలాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. దొంగలను పట్టుకునేందుకు జిల్లా సరిహద్దుల్లో పోలీసులను అలర్ట్ చేశారు. ఈ ఘటనలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రమేయంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఖమ్మం పట్టణంలో సెల్ ఫోన్ దుకాణంలో చోరీ..!

