తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది: డా. విశారదన్ మహారాజ్

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది: డా. విశారదన్ మహారాజ్

నవదిశ నల్గొండ టౌన్ :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని దళితుల భూములను లాక్కుంటూ ఇండస్ట్రీలకు అప్పజెప్తుందని, ధర్మసమాజ్ పార్టీ అధికారంలోకి రావడానికి నల్లగొండ జిల్లా నుండి పోరాటం మొదలు పెడతామని ఆ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహరాజ్ తెలిపారు. ఆదివారం ఎస్బిఆర్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన నల్గొండ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన నల్గొండ జిల్లాలో గ్రామగ్రామాన ధర్మసమాజ్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ప్రతి గ్రామంలో మహారాజుల బోర్డులు స్థాపించే విధంగా కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యమాల జిల్లా నల్లగొండ గడ్డని, ఈ గడ్డనుండే ఉద్యమాలు భూస్వామ్య దోపిడికి వ్యతిరేక ఉద్యమాలు పునికి పుచ్చుకున్నాయని అన్నారు. నల్గొండ జిల్లాలో ధర్మసమాజ్ పార్టీ గ్రామ మండల జిల్లా కార్యవర్గం బలోపేతం దిశగా పార్టీ కార్యచరణ తీసుకుంటుందని, పార్టీ అభివృద్ధికై "కలసిరా..అభివృద్ధి చేదాం" అనే నినాదంతో ముందుకు పోదామని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అగ్రకుల రాజకీయ దోపిడి అరికట్టేందుకు ఓటు హక్కు ఆయుధం కల్పించారని ప్రజలు ఓటు హక్కు ద్వారా మన రాజ్యం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను పార్టీలోకి స్వాగతించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. త్వరలో మిర్యాలగూడ ప్రాంతం నుండి మునుగోడు వరకు మాభూమి రథయాత్ర చేపడతామని, యాత్ర ద్వారా నలగొండ ప్రాంతంలో వెనుకబడిన అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా యాత్ర ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికలలో ధర్మసమాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో నల్గొండ హెడ్ క్వార్టర్ లో పార్టీ కార్యాలయం, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జగన్, ఎల్లన్న,లింగస్వామి, వంశీ,యాదయ్య, రాజు, సతీష్, గౌడ్, పేద మండల అధ్యక్ష కార్యదర్శి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.