తెలంగాణ

ఇన్ స‌ర్వీస్ ఉపాధ్యాయుల‌కు టెట్ నుంచి మిన‌హాయింపు ఇవ్వాలి  

ఇన్ స‌ర్వీస్ ఉపాధ్యాయుల‌కు టెట్ నుంచి మిన‌హాయింపు ఇవ్వాలి  

నవ దిశ - నల్గొండ టౌన్:

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఎన్ సి టి ఈ నిబంధనలకుఅనుగుణంగా 2025 సెప్టెంబర్లో సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనితో అందోళనచెందిన సర్వీస్ ఉపాధ్యాయులు 65 రివ్యూ పిటిషన్లు వేశారు, నిబంధనల ఆధారంగానే సుప్రీం కోర్ట్ ఆ రివ్యూలను కొట్టివేస్తూ 2028 ఆగష్టు 31 లోపు ఇన్ సర్వీస్ టీచర్స్ కు చివరి అవకాశంగా తీర్పు ఇచ్చినది. దీని ప్రకారం సర్వీస్ రిమూవ్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో 30,000 మంది ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావాల్సిన అవసరం ఉంది. ఇటీవల ప్రత్యేకంగా 2సార్లు టెట్ నిర్వహణ చేస్తామనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాస్త ఊరట మాత్రమే. విద్యా హక్కు చట్టం అమలు ద్వారా టెట్ అంశం ప్రస్తావన జరిగింది. 1 ఏప్రిల్, 2010 పూర్వం న్యాయ బద్ధంగా నోటిఫికేషన్ వచ్చి నియామకం అయిన ఉపాధ్యాయులకు ఆనాడు టెట్ ప్రస్తావన లేదు. తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్లో టెట్ అర్హత అధారంగానేనియామకాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1,2010 ఆర్ టి ఈ రూల్స్ కి అనుగుణంగా ఎన్ సి టి ఈ టెట్ నిబంధనలు చేర్చింది. ఈ నిబంధనల ఆధారంగానే సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. ఇది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు అన్యాయం కల్గిస్తుంది. గత 30 సంవత్సరాలనుండి ఉపాధ్యాయులు ఎంపిక చేసుకున్న విషయంలో భోదిస్తున్నారు. టెట్ లో మాత్రం అన్ని విషయాలు కలిపి పరీక్షలు పెట్టడం జరుగుతుంది. భాషా ఉపాధ్యాయులకు, ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా తమ బోధనకు సంబంధం లేని సబ్జెక్టు చదవి పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిప్పుడు ప్రత్యేకంగా టెట్ ఎన్ని సార్లు పెట్టిన ప్రయోజనం లేదనే భావన ఉపాధ్యాయుల్లో ఉంది.పైగా ఎన్సీఈఆర్టీ , ఎస్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో, దీక్ష, నిష్ట లాంటి అనేక ఆన్లైన్ వృత్యంతర శిక్షణ ఇస్తూనే ఉన్నారు. తద్వారా సమకాలిన పరిస్థితులకు అనుగుణంగాఉపాధ్యాయులు. నేర్చుకుంటున్నారు. ఇది అసంబద్ధ నిర్ణయంగా తపస్ అనేకమార్లు ప్రభుత్వాలకు నివేదించింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం- తపస్ ద్వారా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినేన్స్ తెచ్చి ఏప్రిల్ 1,2010 కన్న ముందువేసిన నోటిఫికేషన్ ద్వారా నియమాలు అయిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపును కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ప్రభుత్వంను ఒప్పించేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. కార్య‌క్ర‌మంలో జిల్లా అధ్య‌క్షులు బ‌త్తిని భాస్క‌ర్ గౌడ్‌,ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రేణికుంట్ల రాజ‌శేఖ‌ర్‌, రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఇరుగు శ్రీ‌రాం, రాష్ట్ర వెబ్ క‌న్వీన‌ర్ కంచ‌న‌ప‌ల్లి విజ‌య్‌కుమార్‌,జిల్లా ఉపాధ్య‌క్షులు దోటి కిష‌న్ ప్ర‌సాద్‌, జిల్లా కోశాధికారి నంద్యాల న‌ర్సిరెడ్డి, మునుగోడు మండ‌ల అధ్య‌క్షుడు మిర్యాలముర‌ళి, న‌ల్ల‌గొండ రూర‌ల్ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శినిమ్మ‌న‌గోటి రామ‌కృష్ణ  పాల్గొన్నారు.