జిల్లా వార్తలు

హయత్‌నగర్‌లో వాటర్ లాగింగ్ సమస్యపై డీసీపీ ప్రత్యేక శ్రద్ధా

హయత్‌నగర్‌లో వాటర్ లాగింగ్ సమస్యపై డీసీపీ ప్రత్యేక శ్రద్ధా

నవదిశ హయత్ నగర్:

*ప్రజా ఇబ్బందుల నివారణకు ముందస్తు చర్యలు: డీసీపీ అనురాధ

రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల దృష్ట్యా, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ శనివారం హయత్‌నగర్‌లో పర్యటించారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో వర్షపు నీరు నిలిచే (వాటర్ లాగింగ్) ప్రాంతాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని డీసీపీ అధికారులను ఆదేశించారు.ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.