నవదిశ, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఉన్న రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తూపోయే నిజాలు బయట పడ్డాయి. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న పుప్పులగూడలోని కంచె కేఫ్, నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలను తీవ్రమైన లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఈ రెస్టారెంట్లలో శుభ్రత లేదని వంటగది, స్టోర్ రూమ్‌లలో ఓపెన్ డస్ట్‌బిన్‌లు,నీరు నిల్వ ఉండటం, ఫంగస్ పట్టిన కూరగాయలు (కాలీఫ్లవర్), ఈగలు/బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు మెడికల్ ఫిట్ నెస్, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెసింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్ కు సంబంధించిన ఎలాంటి రికార్డు రెస్టారెంట్ యాజమాన్యం అందుబాటులో లేవు. దీంతో అధికారులు ఈ రెస్టారెంట్లకు తక్షణమే లోపాలు సరిదిద్దుకోవాలని ఆదేశిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణ కోసం తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు.
తెలంగాణ
కంచె కేఫ్, కోడికూర చిట్టిగారే రెస్టారెంట్లకు నోటీసులు జారీ.!

