తెలంగాణ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

నవదిశ నల్లకుంట: నల్లకుంట పరిధిలోని కోరంటి ఫీవర్ హాస్పిటల్ వద్ద కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రోగులకు వివిధ రకాల పండ్లను పంచి పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గౌతమ్, ఓబీసీ అధ్యక్షులు శ్రీ ఆనంద గౌడ్, నల్లకుంట మాజీ కార్పొరేటర్ వై అమృత, కాచిగూడ మాజీ కార్పొరేటర్ శ్రీ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.