తెలంగాణ

మోడీ పన్నెండు ఏళ్ల పాలన పై బీజేపీ పార్టీ ఆఫీస్ లో వేడుకలు

మోడీ పన్నెండు ఏళ్ల పాలన పై  బీజేపీ పార్టీ ఆఫీస్ లో వేడుకలు

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పన్నెండు ఏళ్ల పాలనను పురస్కరించుకుని, పుష్కర కాలం లో మన దేశం సాధించిన ప్రగతిని, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలని స్లయిడ్ షో ద్వారా చూపించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పేదల పక్షపాతి అని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ చేరువ కావాలనేది మన గౌ. ప్రధాని మోడీ తపన అని, ఎవరు అడ్డుపడినా ఈ సంక్షేమ మహా యజ్ఞం ఆగదని, పార్టీ నాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ సిటీ ఆఫీస్ లో వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎం ఎల్ ఎ సిహెచ్ రామచంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్, సెంట్రల్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు దీపక్ రెడ్డి, నల్లకుంట మాజీ కార్పొరేటర్ అమృత, కాచిగూడ కార్పొరేటర్ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.