తెలంగాణ

ఆషాఢ భోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం సమీక్ష..

ఆషాఢ భోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం సమీక్ష..

నవదిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 16న గోల్కొండ దగ్గర బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆగస్టు 2న సికింద్రాబాద్‌లో జరగనున్నఉజ్జయిని మహంకాళి భోనాలలో సీఎం రేవంత్‌ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆగస్టు 3న రంగం లష్కరన్ భోనాల మరుసటి రోజు అత్యంత కీలకమైన కార్యక్రమం జరగనుందని ఉత్సవాల నిర్వహణకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తుల కోసం బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు.