తెలంగాణ

ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన పెరగాలి - చామల

ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన పెరగాలి - చామల

నవదిశ, తెలంగాణ బ్యూరో: శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం అవగాహన సదస్సు విజయవంతంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి చేరాలంటే ఇలాంటి అవగాహన సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు వాటి ప్రయోజనాలను వివరించడంలో పార్టీ శ్రేణులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.