కెరీర్

గురుకులాల్లో పోస్టుల నోటిఫికేషన్ విడుదల

గురుకులాల్లో పోస్టుల నోటిఫికేషన్ విడుదల

నవదిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్, స్పోర్ట్స్, డిస్ట్రిక్ట్ సీఓఈలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐఐటీ-జేఈఈ, నీట్, సీఎంఏ-క్లాట్, యూపీఎస్‌సీ కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి అర్హత, అనుభవం కలిగిన నిపుణులైన బోధకుల నుండి తాత్కాలిక గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తంగా 117 ఖాళీలు ఉండగా.. అందులో ఫౌండేషన్ & స్పోర్ట్స్ సీఓఈ పోస్టులు-50, మ్యాథ్స్-11, ఫిజిక్స్-6, కెమిస్ట్రీ-5, బోటనీ-6, జూవాలజీ-7, సీఎంఏ-5, క్లాట్-4, యూపీఎస్సీ-6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో విద్యాబోధన చేసే వారి కోసం గంటకు రూ.650 చొప్పున గౌరవ వేతనం అందిస్తారు. రోజుకు గరిష్టంగా 7.5 గంటల వరకు పనిచేసే అవకాశం ఉంటుంది.

ఇక జిల్లాల వారీగా అయితే డిస్ట్రిక్ట్ సీఓఈలు మొత్తం 67 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. అందులో మ్యాథ్స్ - 10, ఫిజిక్స్ - 12, కెమిస్ట్రీ - 10, బోటనీ - 16, జూవాలజీ - 19 విభాగాల వారీగా ఖాళీలున్నాయి. దీనికి గానూ గంటకు రూ.250 చొప్పున, నెలకు గరిష్టంగా రూ.32,500 మించకుండా గౌరవ వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు చేయు విధానం: అర్హులైన అభ్యర్థులు సొసైటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కళాశాలల వివరాలను చూసుకుని, అప్లికేషన్ ఫాంను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు సరూర్ నగర్‌లోని స్టేట్ ఆఫీస్2లో స్వయంగా సమర్పించవలసి ఉంటుంది. సెలవు రోజుల్లో కూడా దరఖాస్తులు స్వీకరించబడతాయి. అయితే ఈ నియామకాలు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉంటాయని. ముందస్తు సమాచారం లేకుండా ఎప్పుడైనా వీరి సేవలను నిలిపి వేయవచ్చు అలాగే అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లైన https://tgswreis.telangana.gov.in, https://tgswreis.telangana.gov.inలలో సంప్రదించవచ్చు. లేదా హెల్ప్‌లైన్ నంబర్ 040 2300 5100లో కాంటాక్ట్ కావచ్చు.