తెలంగాణ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం సీజ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం సీజ్

నవదిశ, హైదరాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు భారతీయ ప్రయాణికుల వద్ద నుంచి 2.271 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.36 కోట్లుగా అంచనా వేశారు.

అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏపీఐఎస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ నుంచి అందిన సమాచారంతో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్‌లలో బంగారాన్ని పేస్ట్ రూపంలో దాచినట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన నిపుణులు పరీక్షించగా అది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమని నిర్ధారించారు. అనంతరం ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.