నవదిశ, తెలంగాణ బ్యూరో: పోక్సో కేసు నిందితుడుగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ గడువు ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను శుక్రవారం మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కు పరీక్షల కోసం కోర్టు ఆరు రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి కేంద్ర కారాగారానికి భగీరథ్ ను తరలించారు. ఈ కేసులో నిందితుడి తరుపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ దాఖలు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ
భగీరథ్ బెయిల్ గడువు ముగిసింది

