కెరీర్

రేపే సప్లిమెంటరీ ఫలితాలు..

రేపే సప్లిమెంటరీ ఫలితాలు..

నవదిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు కీలక సమాచారం. జూన్ 2026 లో నిర్వహించిన ఎస్ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు, అనగా జూన్ 25, 2026 (గురువారం) మధ్యాహ్నం 3:00 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కార్యాలయం బుధవారం ఒక అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో గల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించబోయే ప్రెస్ మీట్ ద్వారా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్ ద్వారా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ అయిన www.bse.telangana.gov.in లో నేరుగా చూసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.