లైఫ్ స్టైల్

పెదాలు పొడిబారుతున్నాయా..? ఈ చిట్కాలతో చక్కటి పరిష్కారం.!

పెదాలు పొడిబారుతున్నాయా..? ఈ చిట్కాలతో చక్కటి పరిష్కారం.!

వేసవి కాలంలో చాలా మందికి పెదవులు పొడిబారడం సర్వసాధారణమే. కానీ ఒక్కోసారి సీజన్‌తో సంబంధం లేకుండా కూడా పెదాలు పొడిబారుతుంటాయి. అయితే పెదాలు ఎప్పుడూ పొడిబారడం అనేది శరీరంలో జరిగే మార్పులను తెలియజేస్తుందని, లోపాలను సరి చేసేకునేందుకు ఇదో సంకేతం. దీనిని లైట్ తీసుకుంటే మాత్రం పెద్ద ప్రమాదంలో పడినట్టేనని నిపుణులు చెప్తున్నారు. అసలు పెదాలు ఎందుకు పొడిబారిపోయాయి.. దీనికి కారణాలేంటో చూద్దాం.
విటమిన్ బీ2 లోపం: శరీరంలో విటమిన్ బీ2 ఈ విటమిన్ లోపించినప్పుడు పెదవుల చివర్లు పగిలి నొప్పి పుడుతుంది. అంతేకాకుండా పెదాలు వాచినట్లు కనిపిస్తుంది. కొందరికి పెదవులతో పాటు నాలుక, చర్మం పగిలినట్టు కనిపిస్తుంది. ఐరన్ లోపం: ఐరన్ లోపం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పడిపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణ నెమ్మదిగా జరుగడంతోపాటు పెదవులు పొడిబారడం, చిట్లడం, రంగు మారుతుంటాయి. జింక్ లోపం: జింక్ శరీర రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యం. దీని లోపం వల్ల పెదవులు త్వరగా పొడిబారి చిట్లిపోతాయి.

అయితే ఈ సమస్యమను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిద్దాం.

పెట్రోలియం జెల్లీ: పెదవులకు రక్షణగా ఉండటానికి నాణ్యమైన పెట్రోలియం జెల్లీ లేదా లిప్ బామ్‌ను తరచుగా రాయండి. తేనె, నిమ్మరసం: చెంచా తేనె, నిమ్మరసం కలిపి పెదవులకు రాసి, ఆరిన తర్వాత తడి గుడ్డతో తుడుచుకోవాలి. ఎండలో జాగ్రత్త: ఎండలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిప్ బామ్‌లను వాడితే మంచిది. నీరు ఎక్కువగా తాగండి: రోజువారీ జీవితంలో తగినంత నీరు తీసుకోవడం ద్వారా పెదవులలో తేమ ఎండిపోకుండా ఉంటుంది. నాలుకతో తడపకండి: పెదాలను పదే పదే నాలుకతో తడపడం లేదా కొరకడం లాంటివి చేయవద్దు.