నవదిశ,వెబ్‌డెస్క్: వేదికలపై మాట్లాడాలంటే ప్రస్తుతం తాను ఒకటి రెండుసార్లు ఆలోచిస్తున్న అన్నారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్. నేను ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడినా తప్పుగానే అర్థం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీ కాంత్ సరసన సిమ్రాన్, రాశిఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ధర్మన్’ అనే పేరును ఖరారు చేసి రివీల్ ఈవెంట్ చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ..‘‘వేదికపైకి పిలవగానే మాట్లాడటానికి ప్రస్తుతం సంకోచిస్తున్నాను. నేను ఏం మాట్లాడినా.. అదో సమస్యగామారుతోంది. అది నాతో పాటు ఇతరులకు కూడా ఇబ్బందినీ కలిగిస్తోంది. మాట్లాడకపోతే.. ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతారు. మాట్లాడితే, ఎందుకు మాట్లాడారు. మౌనంగా ఉండొచ్చు కదా అని మరికొందరు అంటారు. మనల్ని ఇష్టపడని వారికి మనం ఏం చేసినా నచ్చదు అంటూ అసహనం వ్యక్తం చేశారు రజనీకాంత్.
సినిమా
మనల్ని ఇష్టపడని వారికి మనం ఏం చేసినా నచ్చదు: రజనీకాంత్

