సినిమా

అవును నేను తల్లిని కాబోతున్నాను : సమంత

అవును నేను తల్లిని కాబోతున్నాను : సమంత

నవదిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నటి సమంత గర్భం దాల్చారు అనే వార్త చక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదటి సారి సామ్ ఆ వార్తల పైన స్పందిస్తూ.... అవును నేను తల్లిని కాబోతున్నాను అంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే... నేడు హైదరాబాద్ లో 'మా ఇంటి బంగారం' చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసి విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ...అవును నేను గర్భం దాల్చాను. ఇకపై నేను సినిమాలకు కాస్త విరామం ఇచ్చి మెటర్నిటీ లీవ్ ను తీసుకోబోతున్నాను. రిస్క్ తీసుకోకపోతే, ఒకే అంశానికి పరిమితం అయిపోతాం. ఇలాంటి పాత్ర చేయడం అనేది నాకు ఒక ఛాలెంజ్ గా అనిపించింది. మూవీ చిత్రీకరణ సమయంలో మా టీమ్ నాకు ఎంతగానో సహకరించింది. అందుకే నా వంతు బెస్ట్ ఇవ్వగలిగాను. చిరంజీవి గారు మమ్మల్ని పిలిచి ప్రశంసించడం మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది అని చెప్పుకొచ్చారు.