సినిమా

సమంతకు ఆ సత్తా ఉంది: రాజ్ నిడిమోరు

సమంతకు ఆ సత్తా ఉంది: రాజ్ నిడిమోరు

నవదిశ, వెబ్‌డెస్క్: అగ్ర కథానాయిక సమంత నటించిన లేడి ఓరియేంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.50 కోట్ల మార్క్‌ను చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సిపిమా ఘన విజయంపై సమంత భర్త,నిర్మాత రాజ్ నిడిమోరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘సమంత స్టార్ పవర్‌ను చాలా మంది తక్కువఅంచనా వేశారు. సినిమా విడుదలకు ముందు ఒక ప్రముఖ వ్యక్తిని కలిసి ‘మా ఇంటి బంగారం’ పై పబ్లిక్ టాక్ ఎలా ఉండొచ్చని అడిగినప్పుడు ఆ వ్యక్తి.. ఇచ్చిన సమాధానం మమల్ని షాక్‌కు గురిచేసిందని చేసింది. మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై ఎలాంటి అంచనాలు ఉండవు.థియేటర్‌లోకి వచ్చాక సినిమా బాగుంటే చూస్తారు.లేదంటే చూడరు అని ఆ వ్యక్తి అన్నారు. ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధగా అనిపించినా అదే నిజమేమో అనిపించింది. అయితే మొదటి రోజు వసూళ్లు వచ్చిన తర్వాత మా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. థియేటర్లకు ప్రేక్షకులను భారీగా రప్పించే శక్తి, సామర్థ్యం సమంతకు ఉంది.లేడి ఓరియేంటెడ్ చిత్రమైనా కంటెంట్ బాగుంటే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించవచ్చని మా ఇంటి బంగారంతో నిరూపించాం’ అని ఆయన చెప్పుకొచ్చారు .