నవదిశ, లక్షెట్టిపేట: లక్షెట్టిపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ లోకి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు సడెన్ గా ఓ మహిళను ఢీకొట్టింది. ఎస్సై సురేష్ వివరాల ప్రకారం.. వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఎలుగం దేవక్క(63) బ్యాంకు పనుల నిమిత్తం కూతురు, అల్లుడితో కలిసి లక్షెట్టిపేటకు వచ్చింది. అనంతరం బ్యాంకు పనులు ముగించుకుని నడుచుకుంటూ బస్టాండ్ కు వస్తుండగా అదే సమయంలో ఎలక్ట్రిక్ బస్సు బస్టాండ్ లోపలికి వస్తూ ఆమె ఢీకొట్టింది. దీంతో మహిళ కాలు నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
క్రైమ్
ఎలక్ట్రిక్ బస్సు ఢీకొని మహిళ మృతి

