నవదిశ,హయత్ నగర్: వనస్థలిపురంలోని ఓ వైన్స్ సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని సుమారు 40-4 5ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అంబులెన్స్ లో బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలు అవ్వడంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆ వ్యక్తి మరణించడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రవిబాబు తెలియజేశారు. మృతుడి కుటుంబ సభ్యులు లేదా ఆచూకీ తెలిసిన వారు 8712662300, 8712662637, 8712662277 నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.
జిల్లా వార్తలు
వనస్థలిపురంలో విషాదం...రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

