నవదిశ,హయత్ నగర్: బిఎన్. రెడ్డి డివిజన్, వైదేహీనగర్ కాలనీలో నీటి సమస్య పరిష్కారం కోరుతూ స్థానిక కాలనీవాసులు సంబంధిత అధికారులను కలిశారు. కాలనీలో మంచినీరు సరైన సమయానికి విడుదల కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు జలమండలి మేనేజర్ భాను ప్రకాష్‌ను కలిసి, తాము సరైన సమయానికి మంచినీరు పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని విద్యుత్ శాఖ ఏడీఈ రామ్ చందర్‌కు కూడా వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, జంగారెడ్డి, నరసింహారెడ్డి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వార్తలు
హయత్ నగర్ లోని ఆ ప్రాంతంలో మంచి నీటి కొరత

