నవదిశ,హయత్ నగర్: కువైట్ టెక్నాలజీని ఉపయోగించి కార్లను చోరీ చేస్తున్న దొంగను వనస్థలిపురం, ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఇల్లా వెంకటరమణ(37), ఆంధ్రప్రదేశ్, రాజమహేంద్రవరం జిల్లా, రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామనికి చెందిన వ్యక్తి అయినట్లు సమాచారం. ఈ వ్యక్తి గతంలో కువైట్‌లో ఎనిమిదేళ్ల పాటు కార్ మెకానిక్‌గా పనిచేశాడు. అక్కడ వాహనాల సెక్యూరిటీ మోడల్స్ ను ట్యాంపర్ చేయడంలో మెళకువలు నేర్చుకుని, అదే నైపుణ్యంతో వాహనాలను చోరీ చేస్తున్నాడని సీఐ రవిబాబు తెలిపారు. నిందితుడి నుంచి 3 కార్లు, ఒక బైక్‌తో పాటు వాహనాల తాళాలు/లాక్‌లను బద్దలు కొట్టే ప్రత్యేక టూల్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
జిల్లా వార్తలు
కువైట్ టెక్నాలజీతో కార్ల దొంగతనం

