నవదిశ,రాజేంద్రనగర్: టీపీసీసీ ఆధ్వర్యంలో 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ శిక్షణ శిబిరం' దేవరపల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించబడింది. ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఎస్ఐఆర్ పైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బిఎల్ఏలకు అవగాహన కల్పించారు. తదుపరి విజయ డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, బిఎల్ఏలకు ఎస్ఐఆర్ పై పూర్తి అవగాహన కల్పించి శిక్షణను ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై ఏజెంట్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి రాబోయే రోజుల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణా శిబిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వార్తలు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

