జిల్లా వార్తలు

హయత్ నగర్ పరిధిలో భారీ వర్షం

హయత్ నగర్ పరిధిలో భారీ వర్షం

నవదిశ,హయత్ నగర్: మండల పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్, చింతలకుంట, హైకోర్టు కాలనీ, సాహెబ్‌నగర్, వనస్థలిపురం ప్రాంతాలల్లో ఈ రోజు సాయంత్రం భారీ వర్షం పడింది. అర గంటకు పైగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. అర్ధ గంట సమయం తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో వాహన దారులు నెమ్మదిగా తిరిగి ప్రయాణాన్ని కొనసాగించారు.