నవదిశ, కొడంగల్: 2026" సంవత్సరం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "డ్రగ్స్ అవేర్‌నెస్ వీక్" కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు దౌల్తాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువకులు, విద్యార్థులు భవిష్యత్తులో సర్వం కోల్పోతున్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు కబడ్డీ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయడం జరిగిందని దౌల్తాబాద్ మండల ఎస్సై కే. వేణు కుమార్ తెలియజేశారు.
జిల్లా వార్తలు
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం..

