జిల్లా వార్తలు

నీటిలో పడి చిన్నారి మృతి

నీటిలో పడి చిన్నారి మృతి

నవదిశ,జనగామ: జిల్లాలోని అంబేద్కర్ నగర్‌లో ఆడుకుంటూ వెళ్ళి నీటి సంపులో పడి రియాన్సీ అనే ఓ రెండు సంవత్సరాల పసిపాప మృతి చెందింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుతూ కనిపించిన చిన్నారి ఒక్కసారిగా నీటి సంపులో విగతజీవిగా కనిపించే సరికి ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. నానమ్మ, నానమ్మ అంటూ తన చుట్టూ తిరుగుతూ అల్లరి చేసే మనవరాలు తన కళ్లముందే చనిపోవడంతో తట్టుకోలేక ఆ చిన్నారి నానమ్మ నాగమ్మ (66)గుండెపోటుతో కన్నుమూసింది.