నవదిశ, రంగారెడ్డి బ్యూరో: శామీర్‌పేట్ తహసీల్దార్ (ఎమ్మార్వో) సుచరితపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఇప్పటికే లంచం కేసులో అరెస్టై జైలులో ఉన్న సుచరితపై తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. మే 26న శామీర్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాలా కన్వర్షన్ కోసం రైతుల నుంచి రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తన డ్రైవర్ ద్వారా రూ.2 లక్షల అడ్వాన్స్ లంచం తీసుకుంటుండగా సుచరితను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా సుచరిత నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఆమె బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమాస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాల కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
జిల్లా వార్తలు
శామీర్‌పేట్ ఎమ్మార్వోపై ఏసీబీ దాడులు.. అక్రమాస్తుల కేసు నమోదు..

