జిల్లా వార్తలు

రోడ్డు భద్రత చర్యలు చేపట్టిన అధికారులు

రోడ్డు భద్రత చర్యలు చేపట్టిన అధికారులు

నవదిశ, హయత్‌నగర్: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని విజయవాడ జాతీయ రహదారి వెంట రోడ్డు పక్కన పేరుకుపోయిన మట్టి, చెత్తను సంబంధిత శాఖ సిబ్బంది యంత్రాల సహాయంతో తొలగించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల్లోకి మట్టి చేరకుండా, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు భద్రత, పరిశుభ్రత మెరుగుపడేందుకు ఈ చర్యలను చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు.