నవదిశ:మహబూబ్ నగర్:దేవరకద్ర మున్సిపాలిటీలోని సద్గురు ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థాన నూతన కార్యనిర్వహణ గ్రేట్ 2 అధికారిగా శివానంద చారి బాధ్యతలు స్వీకరించారు.శివానందా చారి ఇంతకుముందు పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించారు.దేవరకద్ర మున్సిపాలిటీ సద్గురు ఈశ్వర వీరప్పయ్య దేవస్థానంలో కార్య నిర్వహణ అధికారి గ్రేట్ 2 గా పదోన్నతి పొంది,బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా దేవస్థాన సిబ్బంది,భక్తులు, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.దేవస్థాన అభివృద్ధి,భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో కృషి చేస్తానని శివానంద చారి తెలిపారు.నూతన బాధ్యతలు చేపట్టిన శివానంద చారికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు,భక్తులు శాలువాతో సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నాగరాజు స్వామి,నాగభూషణ్ స్వామి,గౌని రాము,గౌని శ్రీనివాస్,నాగష్, డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,కౌకుంట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వార్తలు
ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానం నూతన ఈఓగా శివానంద చారి

