జిల్లా వార్తలు

శారదా నగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు కారణం ఏమిటంటే..?

శారదా నగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు కారణం ఏమిటంటే..?

నవదిశ,హయత్ నగర్: ముందుగానే ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ సరఫరా, రోడ్డు భద్రత కోసం అధికారుల శారదానగర్ లో ముందస్తు చర్యలు చేపట్టారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శారదా నగర్ హనుమాన్ టెంపుల్ సమీపంలోని చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. వర్షాల సమయంలో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్తగా ఆ కొమ్మలను తొలగిస్తున్నారు. ఈ చర్యల వల్ల భారీ వర్షాలు, గాలివానల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండటంతో పాటు,రోడ్డుపై ప్రయాణించే వారికి ప్రమాదాలు జరగకుండా భద్రత ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదాలను నివారించడానికి అధికారులు తీసుకుంటున్న ఈ చొరవ అభినందనీయమని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, పచ్చదనాన్ని కాపాడుతూనే, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధంగా ఈ పనులు చేపట్టడం అనేది మంచి విషయంగా పరిగణిస్తున్నారు స్థానికులు.