నవదిశ, తాండూరు: ఐదు రోజుల క్రితం యాలాల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇసుక డంపు వేలంలో అవినీతికి పాల్పడ్డాడని ఆర్ ఐ పై ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా యాలాల ఆర్ ఐ శివచరణ్ అవినీతి బాగోతం బయటపడింది. ఓ రైతుతో ఫోన్ లో బేర సారాలు ఆడిన ఆడియో రికార్డింగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నాగసముందర్ గ్రామానికి చెందిన మెట్టు రాములుకు సంబంధించి 2 ఎకరాల పట్టా భూమి ఉంది. రాములు మృతి చెందిన తర్వాత ఆ భూమిని మెట్టు వెంకటేష్ ,శ్రీనివాస్ బదిలీ చేసుకున్నారు. కాగా డిఎస్ పెండింగ్లో ఉండడంతో పట్టా పాస్ పుస్తకం వారికి అందలేదు. ఈ విషయమై ఆర్ ఐ శివ చరణ్ ని బాధితులు సంప్రదించారు. ఆర్ ఐ శివ చరణ్ 20,000 రూపాయలు ఇస్తే ఫైల్ క్లియర్ చేసి సబ్ కలెక్టర్ కు పంపిస్తానని బాధితులతో భేరాసారాలకు దిగాడు. ఈతతంగాన్నంతా బాధితుడు తన సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు. తీర పదివేల రూపాయలకు ఒప్పందం చేసుకున్న ఆర్ఐ ఆదివారం అయినా సరే నీ పనిని చేసి పెడతానని బాధితునికి హామీ ఇచ్చాడు. యాలాల్ మండలంలో కాగ్న నది ప్రవహించడంతో భారీ ఎత్తున అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఇసుక వాహనలను సీజ్ చేసిన అధికారులు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఇసుకను డంప్ చేశారు. దాదాపు 120 ట్రాక్టర్ల పైగా ఉన్న ఇసుకను ఎటువంటి ప్రకటన లేకుండా ఒక వ్యక్తికి 36 వేలకు మాత్రమే 60 ట్రాక్టర్ల ఇసుక ఉందని చూపిస్తూ ఓ వ్యక్తికి కట్టబెట్టాడు. అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక వేలం వేసే ముందు ప్రకటన విడుదల చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా ఇసుకను ఒక వ్యక్తికి మాత్రమే అప్పజెప్పడంలో ఆర్ ఐ తో పాటు మరికొందరు రెవిన్యూ కార్యాలయంలోని ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈ ఇసుక వ్యవహారంలో రెవిన్యూ సిబ్బంది కూడా జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఆర్డీవోకి మెమొరండం అందించారు.
జిల్లా వార్తలు
బయటపడ్డ యాలాల ఆర్ఐ బాగోతం..

