నవదిశ, తెలంగాణ బ్యూరో : రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ తో కలిసి కర్ణాటకలో పర్యటించనున్నారు. విజయనగర జిల్లా హాస్పిటల్ వద్దనున్న తింగభద్ర జలశయం గేట్ల ప్రాంభోత్సవానికి వారిద్దరూ హాజరుకానున్నారు. తుంగభద్ర డ్యామ్ లో నూతనంగా 33 స్పిల్ వే గేట్లను ఏర్పాటు చేశారు. గతంలో తుంగభ్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోయిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొత్త గేట్ల పునర్ నిర్మాణ పనులు చేపట్టింది. ఈ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో రేపు ప్రారంభోత్సవం జరగనుంది. కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం రేవంత్ అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
రేపు కర్ణాటకలో పర్యటించునున్న సీఎం రేవంత్..

