తాజా వార్తలు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా.!

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా.!

నవదిశ, వెబ్ డెస్క్: తెలంగాణాలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, స్పీకర్‌తో సహా సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని దానం, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డికి ఆదేశాలు పంపింది. గతంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పుపై హై కోర్టులో పలువురు ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. విచారణ సందర్భంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కి వాయిదా వేసింది.