జాతీయం

తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు సీఎంలు

తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు సీఎంలు

నవదిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కర్ణాటక పర్యటనకు వెళ్లారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌ వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మునిరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. పర్యటన పూర్తి చేసుకుని సాయంత్రం 3 గంటలకు సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

ఈ పర్యటనలో భాగంగా కర్ణాటకలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో ముగ్గురు ముఖ్యమంత్రుల కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో కర్ణాటక సీఎం శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు,ఇరిగేషన్ అధికారులు ఈ చర్చల్లో భాగస్వామ్యమయ్యారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలపై ప్రధానంగా చర్చించారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం, నీటి పంపకాలపై మూడు రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్యామ్ నిర్వహణ, భవిష్యత్తు కార్యాచరణపై కేంద్ర మంత్రితో కలిసి మాట్లాడారు.