జాతీయం

రేయ్ అని పిలిస్తే శిక్ష ఖాయం..

రేయ్ అని పిలిస్తే శిక్ష ఖాయం..

నవదిషశ, తెలంగాణ బుర్యో: ఫోన్‌లో, సోషల్ మీడియాలో లేదా ప్రత్యక్షంగా ఇతరులను అవమానకరంగా సంబోధించడం, బెదిరించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలు చట్టపరంగా నేరమని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (బి ఎన్ ఎస్)లోని పలు సెక్షన్ల ప్రకారం ఇలాంటి చర్యలకు జైలు శిక్షలు, జరిమానాలు విధించే అవకాశం ఉంది. వర్తించే ప్రధాన సెక్షన్లు : బిఎన్ఎస్ సెక్షన్ 196 సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు ఈ సెక్షన్ వర్తిస్తుంది. శిక్ష: గరిష్ఠంగా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా. బిఎన్ఎస్ సెక్షన్ 296 అశ్లీల పదజాలంతో ఇతరులను అవమానించడం, అసభ్యకర ప్రవర్తనకు పాల్పడడం నేరంగా పరిగణిస్తారు. శిక్ష: 3 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా. బిఎన్ఎస్ సెక్షన్ 352 ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా వివాదాలు, గొడవలకు దారితీసేలా ప్రవర్తించడం ఈ సెక్షన్ కిందకు వస్తుంది. శిక్ష: 3 నెలల వరకు జైలు శిక్ష. బిఎన్ఎస్ సెక్షన్ 295A మతపరమైన భావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం, మత విశ్వాసాలను అవమానించడం చట్టరీత్యా నేరం. జాగ్రత్తగా వ్యవహరించాలి నిపుణుల అభిప్రాయం ప్రకారం, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ లేదా వ్యక్తిగత సంభాషణల్లో అనుచిత పదజాలం, అవమానకర వ్యాఖ్యలు, బెదిరింపులు చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.