నవదిశ, కర్ణాటక: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర ప్రజల సమస్యలు, నీటి పంపిణీ, సాగునీటి ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన వివిధ నీటి అంశాలపై పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రాల మధ్య సమన్వయంతో జల వనరుల వినియోగం, నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

