జాతీయం

నేడు ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు

నేడు ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు

నవదిశ, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కర్ణాటక పర్యటనకు బయలుదేరారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు కూడా కర్ణాటకకు వెళ్లారు.

హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యామ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం మునిరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ తరఫున ఉప ముఖ్యమంత్రి డి.కే. శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.

తుంగభద్ర ప్రాజెక్టు దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ, సాగునీటి అవసరాలకు కీలకమైనదని, నూతన స్పిల్‌వే గేట్ల ఏర్పాటు ద్వారా డ్యామ్ భద్రత, నీటి నిర్వహణ మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.