నవదిశ, నల్గొండ టౌన్: రాహుల్ గాంధీ ఇటీవల రాజస్థాన్ కోటలో జరిగిన 'చాత్రోంకి గూంజ్ - విద్యార్థి యువత గొంతుక' అనే మహా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం అన్నారు పున్న కైలాష్. నల్గొండ జిల్లా కేంద్రం యాదవ్ సంఘం భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ మాట్లాడుతూ... దేశంలోని కోట్లాది విద్యార్థి కుటుంబాలకు భరోసా నింపుతున్న రాహుల్ గాంధీ ఆలోచనలను పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్షల రద్దుకు బాధ్యత వహించి కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం విఫలం అయింది. పార్లమెంట్ లో దీనిపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటన చేయాలి. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని తమ డిమాండ్ ను వ్యక్తం చేశారు. పరీక్ష రద్దు వలన సుమారు 25 లక్షల కుటుంబాలు నష్టపోయాయి. యువత పైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. వందల సంఖ్యల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రశ్నపత్రాల లీకులు పరీక్షల రద్దు ఉద్యోగ నియామకాలలో జాప్యం నిరుద్యోగం,148 సార్లు పరీక్షలు లీక్ అయ్యాయి. ఎన్టీఏ కోసం ప్రశ్నపత్రాన్ని రూపొందించిన డాక్టర్ ప్రశ్న పత్రాన్ని అమ్ముకుంటుంటే మోడీ నిఘా వ్యవస్థ నిద్రావస్థలో ఉన్నది అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బోడ స్వామి, ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్ తదితరులు పాల్గొన్నారు..
NEWS
దేశ ప్రజలకు నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలి: డీసీసీ అధ్యక్షుడు

