కబడ్డీ.. కబడ్డీ.. భారత దేశంలో అనేక క్రీడలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ కి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. దానికి సమానంగా అంతే ప్రాధాన్యతను సంతరించుకున్న మరో క్రీడా కబడ్డీ. కబడ్డీ క్రీడ చాలా పురాతనమైనది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆటకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీని చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కబడ్డీ గురించి చాలా రకాల చరిత్రలు ఉన్నాయి. విదేశాల్లోనూ ఈ ఆటను ఆడుతారు. అయితే భారతదేశ విషయానికి వస్తే మన దేశంలో కూడా కబడ్డీ ఆటకు చరిత్ర ఉంది. పురాణాల నుంచి కూడా ఈ ఆటను ఆడే వారిని చరిత్ర చెబుతుంది. ఈ ఆటకు మహాభారత మూలాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. చేతులు పట్టుకోవడం అని తమిళ పదం అనే అర్థం వచ్చే కై కైపిడి నుంచి కబడ్డీ అనే పదం వచ్చిందని కొందరు చెబుతుంటారు. అలాగే అనేక రకాలైన భావాలు, చరిత్ర ఉంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ ఆట ప్రసిద్ధి చెందింది. కబడ్డీ బంగ్లాదేశ్ జాతీయ క్రీడగా ఉంది. 1920లో మొట్టమొదటి వ్యవస్థ పోటీలు జరిగాయి. 1950లో అఖిలభారత కబడ్డీ సమైక్య స్థాపించారు. 1951 లో జరిగిన ఆసియా క్రీడల్లో కబడ్డీ ఆడారు. 1990లో మొదటిసారి పతక క్రీడగా మార్చారు. ఆసియా క్రీడలతోపాటు ప్రపంచ కబడ్డీ పోటీలు కూడా నిర్వహించారు. ఈ పోటీలో భారతదేశం తన ప్రతిభను చాటింది. ప్రపంచ పోటీల్లో అత్యధికంగా భారతదేశ ఎక్కువ ట్రోఫీలు గెలుచుకుంది. 2002 నుంచి 2014 వరకు ఆసియా క్రీడల్లో భారతదేశం తరుపున పురుషులు, మహిళలు విజయం సాధించారు. 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో ఇరాన్ గెలిచింది. భారతదేశము తర్వాత గెలిచిన మొదటి దేశం ఇరాన్. ఇక ఈ ఆట ఎంతమంది ఆడుతారు, ఏ విధంగా ఆడుతారు, దాని ప్రమాణాలు ఏంటి తెలుసుకుద్దాం.
ఇరు జట్లుగా ఆడే ఆట :
కబడ్డీ ఆటలో ముఖ్యంగా రెండు జట్లు పోటీ పడతాయి. ఒక్కో జట్టులో ఏడుగురు సభ్యులు ఉంటారు. వీరితోపాటు అదనంగా ఐదుగురు సభ్యులు రిజర్వ్ ఉంటారు. ఇందులో రైడర్, డిపెండర్ , తదితర సభ్యులు ఉంటారు.
కోర్టు కొలతలు :
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పురుషుల కోర్టు 10 × 13 మీటర్లు ఉంటుంది. మహిళల కోర్టు 8× 12 మీటర్లు ఉంటుంది.
కాలవ్యవధి :
కబడ్డీ ఆటకి కాలవ్యవధి ఉంటుంది. 40 నిమిషాలపాటు ఇరుజట్ల మధ్య పోటీని నిర్వహిస్తారు. మొదటి 20 నిమిషాలు, తర్వాతి 20 నిమిషాలు రెండుసార్లు పోటీ ఉంటుంది. మధ్యలో విశ్రాంతి ఇస్తారు. ఈ సమయంలో ఇరు జట్లు గెలుచుకున్న పాయింట్లను బట్టి విజేతను నిర్ణయిస్తారు. ఒక్కో రైడర్ కు 30 సెకండ్ల సమయం ఉంటుంది. ఆ సమయంలోనే ప్రత్యర్థి జట్టు కోర్టులో అవుట్ చేయడం కానీ అతను అవుట్ కావడం కానీ ఉంటుంది. రైడర్ ప్రత్యర్థి కోర్టుకి వెళ్ళినప్పుడు.. కచ్చితంగా కబడ్డీ కబడ్డీ అంటూ తప్పకుండా పలకాల్సి ఉంటుంది.
పాయింట్లు విధానం : ఒక జట్టు రైడర్ మరో కోర్టులోకి వెళ్లినప్పుడు.. తనకు కేటాయించిన 30 సెకండ్లలో ప్రత్యేకించి ఆటగాళ్లను ఎంతమందిని తాకి.. తిరిగి కోర్టు మధ్యలో ఉన్న గీతను తాకితే.. అన్ని పాయింట్లు వస్తాయి. అయితే బయటకు వెళ్లిన వ్యక్తి నీ పద్ధతి జట్టు పట్టుకున్న , సెల్ఫ్ అవుట్ చేసిన రైడ్ కి వెళ్లిన జట్టు పాయింట్ ను కోల్పోవలసి ఉంటుంది.
ప్రో కబడ్డీ తో భారతదేశంలో మరింత ఆదరణ :
భారతదేశంలో కబడ్డీకి మరింత ఆదరణ తేవడానికి.. అఖిలభారత కబడ్డీ సమైక్య ప్రో కబడ్డీని నిర్వహించింది. క్రికెట్లో ఐపీఎల్ తరహా కబడ్డీ పోటీలు కూడా నిర్వహించింది. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. 2014లో ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ క్రీడా అభిమానుల మన్ననలు పొందింది. అంతకుముందు కబడ్డీ క్రీడకు ఉన్న క్రేజ్ కంటే.. రెట్టింపు సంఖ్యలో కబడ్డీకి సాధన లభించింది. మొదటిసారి నిర్వహించిన పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 12 జట్లు పోటీపడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన చాలామంది కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభ చాటి అలరించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ పోటీలు నిర్వహించారు. సినీ, ఇతర రంగాల ప్రముఖులు సైతం ప్రో కబడ్డీ లీగ్ కు ప్రమోషన్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా కబడ్డీ పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో వరుసగా.. లీగ్ నిర్వహిస్తూ వచ్చారు. ఈ పోటీల ద్వారా ఎంతోమంది క్రీడాకారులు సైతం వెలుగులోకి వచ్చారు.
కబడ్డీ భారతదేశంలో మొత్తానికి ప్రస్తుతం క్రీడ అభిమానుల మన్ననలు పొందుతున్న క్రీడల్లో ఒకటిగా ఉన్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే.. క్రీడకు మరింత ఆదరణ పెంచడానికి, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి మరిన్ని ఆకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని భావించవచ్చు.

