తెలంగాణ

తెలంగాణలో మరో వారంపాటు భారీ వర్షాలు.. జర భద్రం.!

తెలంగాణలో మరో వారంపాటు భారీ వర్షాలు.. జర భద్రం.!

నవదిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కొన్ని రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రాగల 7 రోజుల పాటు విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. గంటకు 30 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు.. నిర్మల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది.