నవదిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ అధికారిక సలహాదారు, ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ప్రతిష్టాత్మక 'పద్మభూషణ్' పురస్కారం వరించింది. వైద్యరంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ పరిశోధనలు, చికిత్సలో ఆయన అందించిన అసమాన సేవలకు గుర్తింపుగానూ కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పరస్కారాన్ని అందుకున్నారు. దీంతో డాక్టర్ దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేస్తూ ద్రౌపదీ ముర్ముకు కృత్ఞలు తెలిపారు.
తెలంగాణ
డా. నోరి దత్తాత్రేయుడిని వరించిన 'పద్మభూషణ్' పురస్కారం..

