రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారీ సంఖ్య లో 15,982 పోస్టులు భర్తీ చేయనుంది.ఆయా జిల్లాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందిఅంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టులకు ఈ సారి ఇంటర్మీడియట్ తప్పనిసరి. అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకు వచ్చింది. ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నం. 4, మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నం. 6 జారీ చేసింది. మల్టీజోన్ - 1 పరిధిలో మొత్తం 20, 584 కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 హెల్పర్లు పోస్టులు మొత్తం కలిపి 9,590 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్ - 2 పరిధిలో 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,145 హెల్పర్లు కలిపి 6,392 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత ఈ సారి తప్పనిసరి చేసింది.
తెలంగాణ
అంగన్ వాడీల్లో కొత్త కొలువుల జాతర..

