తెలంగాణ

హైదరాబాద్‌లోనే ఏపీ సీఎం..

హైదరాబాద్‌లోనే ఏపీ సీఎం..

నవదిశ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్‌లోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఏఐజీ ఆస్పత్రిని సందర్శించనున్నారు. అనంతరం, రేపు ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. పలు అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.