తెలంగాణ

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు

నవదిశ, తెలంగాణ బుర్యో: సింగరేణి సంస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో జైలులో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం కోర్టు రూ. 25 వేల పూచీకత్తుఆయనను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీజీ బి కె కె ఎస్ సమావేశంలో బాల్క సుమన్ సింగరేణి సంస్థ, కార్మికులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మిలిటెంట్ తరహాలో నిరసనలు తెలిపాలని పిలుపునిచ్చారు.ఆ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. ఈ వివాదంపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాల్క సుమన్‌పై దేశద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో గత నెల 29వ తేదీన పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. దాదాపు 25 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అనంతరం హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.